Sunny Leone Look | పల్లె వెలుగు బస్సు దిగుతున్న సన్నీలియోన్..పోస్టర్ అదిరిందంతే..!
ఇషాన్ సూర్య (Ishan Surya) దర్శకత్వం వహిస్తున్న జిన్నా చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput), సన్నీలియోన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. తన అందాలతో కుర్రకారును ఫిదా చేసే సన్నీలియోన్ పోస్టర్ (Sunny Leone look) వచ్చేసింది. ఈ చిత్రంలో రేణుక అనే అమ్మాయి పాత్రలో నటిస్తోంది సన్నీలియోన్. ఈ భామ రోజ్ కలర్ మినీ
టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు (Manchu Vishnu) ప్రస్తుతం జిన్నా (Ginna) లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇషాన్ సూర్య (Ishan Surya) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput), సన్నీలియోన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పాయల్ రాజ్‌పుత్ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. కాగా ఇపుడు తన అందాలతో కుర్రకారును ఫిదా చేసే సన్నీలియోన్ పోస్టర్ (Sunny Leone look) కూడా వచ్చేసింది.
ఈ చిత్రంలో రేణుక అనే అమ్మాయి పాత్రలో నటిస్తోంది సన్నీలియోన్. ఈ భామ రోజ్ కలర్ మినీ స్కర్ట్, వైట్ టాప్ లో ఉన్న స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని పల్లెవెలుగు బస్సు దిగుతోంది. మోడ్రన్ డ్రెస్‌లో ఇలా ఆర్టీసీ బస్సులో నుంచి దిగుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది సన్నీ. తాజా పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని, అంచనాలను అమాంతం పెంచేస్తుంది. జిన్నా చిత్రాన్ని హోం బ్యానర్ ఏవీఏ ఎంటర్టైన్మెంట్ (AVA Entertainment)పై మంచు విష్ణు నిర్మిస్తున్నాడు.
‘రేణుకను మీకు పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. నేను జిన్నా చిన్ననాటి స్నేహితురాలిని..కానీ నేనతని జీవితాన్ని తలకిందులు చేయనని కాదు.. ఊహించని మలుపులు, ట్విస్టులతో ఈ ప్రయాణం క్రేజీగా ఉండబోతోంది..’అంటూ ట్వీట్ చేసింది సన్నీలియోన్.
So excited to introduce to you – #Renuka!
I am #Ginna 's childhood buddy but that doesn't mean I won't turn his life upside down 🤭!! It's going to be a crazy journey full of unexpected twists and turns 😎#SunnyLeone #GinnaRenuka @iVishnuManchu pic.twitter.com/R8uWcemweW— Sunny Leone (@SunnyLeone) August 10, 2022
ఈ మూవీకి కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందించడంతోపాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్షన్లో వస్తున్న జిన్నాకు చోటా కే నాయుడు సినిమాటోగ్రఫర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

