బాలీవుడ్ (Bollywood) తార సన్నీలియోన్ (Sunny Leone)-డానియల్ వెబర్ (Daniel Weber) దంపతులు 2018లో సరోగసీ (Surrogacy) విధానం ద్వారా కవలలు నోవా, అషెర్కు వెల్కమ్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే కవలల కోసం చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నారట ఈ కపుల్. అయితే ఆ తర్వాత సరోగసి వర్కవుట్ కాకపోవడంతో నిషా అనే చిన్నారిని దత్తత తీసుకున్నారు. తక్కువ టైంలో ముగ్గురు పిల్లలను పొందిన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది సన్నీలియోన్. సరోగసి తమకు వర్కవుట్ కాకపోవడంతో గుండె ముక్కలైనంత పనైనట్టు చెప్పుకొచ్చి సన్నీలియోన్.
సరోగసి ప్రక్రియ పూర్తి చేయడం కోసం ఏడాదిన్నర సమయం పట్టింది. ఒకానొక టైంలో గుండె బద్దలైంది. మేమెందుకు దత్తత తీసుకోకూడదనిపించింది. అప్పుడే దత్తత కోసం రిజిస్టర్ చేసుకున్నాం. నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిల కోసం ప్లాన్ చేసుకున్నాం. సరోగసి అనుకున్న ప్రణాళిక ప్రకారం జరుగలేదు. ఆ సమయంలో తాను, డానియల్ వెబర్ ముంబైలోని సెయింట్ కేథరీన్స్ హోమ్ అనాథాశ్రమాన్ని సందర్శించినట్టు చెప్పింది.
మేము అనాథాశ్రమంలో ఆ పిల్లలందరినీ చూస్తున్నాము. మేమిద్దరం ఒక చిన్నారిని ఎందుకు దత్తత తీసుకోలేము ? తేడా ఏంటి ? ఆమె ఎప్పటికీ మాది. మేము జన్యుపరంగా దగ్గరవ్వలేదు కానీ మా హృదయం ద్వారా కనెక్ట్ అవుతామనిపించింది. అదే వారంలో నిషాను దత్తత తీసుకున్నామని, ఇదంతా దేవుడి ప్లాన్ ప్రకారం జరిగిందని చెప్పుకొచ్చింది.