Sunny Deol | సన్నీ డియోల్ చిత్రం ‘సూర్య’కు హైకోర్టులో ఊరట.. విడుదలపై స్టే నిరాకరణ!
Sunny Deol | సన్నీ డియోల్ నటించిన తాజా చిత్రం ‘సూర్య: అంత్ సే ఆరంభ్ తక్’ విడుదలపై స్టే విధించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.
Sunny Deol | సన్నీ డియోల్ నటించిన తాజా చిత్రం ‘సూర్య: అంత్ సే ఆరంభ్ తక్’ విడుదలపై స్టే విధించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీంతో నవంబర్ 20న ఈ సినిమా థియేటర్లలో విడుదల కావడానికి మార్గం సుగమమైంది. ఇదే అంశంపై మరో పిటిషన్ విచారణలో ఉన్నందున, వేర్వేరు కేసులు వేయకుండా ప్రస్తుత విచారణలోనే చేరాలని కోర్టు సూచించింది.
ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యులను అవినీతిపరులుగా చూపుతున్నారని, ఆరోగ్య రంగ నిపుణులపై హింసను ఈ చిత్రం ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ డాక్టర్లు నాచికేత భాటియా, ధృవ్ చౌహాన్ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. చిత్ర ట్రైలర్ వైద్యులపై భౌతిక దాడిని హీరోయిజంగా చూపుతోందని, దీనివల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC), కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలు ఈ సినిమాలోని అభ్యంతరకర దృశ్యాలను తొలగించేలా ఆదేశించాలని కోరారు.
అయితే, ఇదే అంశంపై సింగిల్ జెంచ్ వద్ద మరో పిటిషన్ పెండింగ్‌లో ఉందని, ఒకే విషయానికి సంబంధించి బహుళ కేసులు వేయడంలో అర్థం లేదని ఆక్టింగ్ చీఫ్ జస్టిస్ నితిన్ వాసుదేవ్ సాంబ్రే, జస్టిస్ సంజయ్ శర్మలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషనర్లు కావాలంటే ఆ సింగిల్ జెంచ్ విచారణలో భాగస్వాములు కావచ్చని లేదా అధికారులకు వినతిపత్రం సమర్పించుకోవచ్చని కోర్టు వెసులుబాటు కల్పించింది. మరోవైపు, ఈ సినిమాకు ఇప్పటివరకు సెన్సార్ సర్టిఫికేట్ జారీ కాలేదని, ఇది దక్షిణాది చిత్రానికి రీమేక్ అని సీబీఎఫ్సీ తరఫు న్యాయవాది తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

