Sunny Deol | గదర్-2 తెచ్చిపెట్టిన క్రేజ్.. షూటింగ్‌కు ముందే సన్నీడియోల్ కొత్త సినిమాకు వంద కోట్ల డీల్..!
Sunny Deol | ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో గదర్-2 ఒకటి. రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న సన్నీ డియోల్ రూ.500 కోట్లు కొల్లగొట్టే సినిమాలో భాగం అవుతాడని బహుశా ఆయన కూడా ఊహించి ఉండడు.
Sunny Deol | ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో గదర్-2 ఒకటి. రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న సన్నీ డియోల్ రూ.500 కోట్లు కొల్లగొట్టే సినిమాలో భాగం అవుతాడని బహుశా ఆయన కూడా ఊహించి ఉండడు. ఎప్పుడో సోలో హీరోగా మార్కెట్ కోల్పోయిన సన్నీ డియోల్ ఇలా ఊహకందని రేంజ్లో ఖాన్, కపూర్ల సినిమాలను బ్రేక్ చేస్తూ సంచలన రికార్డులు నెలకొల్పాడు. బి.సి సెంటర్ల ప్రేక్షకులను మెప్పించగలిగితే ఆ సినిమా కలెక్షన్లు ఏ రేంజ్లో ఉంటాయో గదర్-2 నిరూపించింది. సినిమా రిలీజై రెండు నెలలు దగ్గరికొస్తున్నా.. ఇంకా కొన్ని చోట్ల డీసెంట్ కలెక్షన్లు రాబడుతుంది. ఇక సన్నీ డియోల్‌కు ఈ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్ అంతా ఇంతా కాదు.
ప్రస్తుతం సన్నీ డియోల్.. అమీర్ ఖాన్ ప్రొడక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. సన్నీకి దామిని, ఘాయల్, ఘాతక్ వంటి హ్యాట్రిక్ హిట్లిచ్చిన రాజ్ కుమార్ సంతోషి ఈ సినిమాకు దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. షూటింగ్ మొదలు కాకముందే ఈ సినిమాకు ఓ పేరున్న ఓటీటీ సంస్థ అక్షరాల వంద కోట్ల డీల్‌ను ఆఫర్ చేసిందట. అయితే అమీర్ ఇంకా మంచి రేటు వస్తుందనే ఉద్దేశంతో ఇంకా నిర్ణయం చెప్పలేదట.
ఇక ఈ సినిమాకు జిస్నే లాహోర్ నహీ దేఖా అనే పేరును పరిశీలనలో ఉంచారట. 1947 ఇండియా పాకిస్థాన్ విభజన టైంలో లక్నో నుంచి లాహోర్ వెళ్లిన శరణార్ధుల విషాద పరిణామాల చుట్టూ తిరిగే కథగా ఈ సినిమా ఉండబోతుందని హిందీ మీడియాల సమాచారం. ప్రస్తుతం చిత్ర యూనిట్ నటీ నటులను ఎంపిక చేసే పనిలో పడ్డారట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

