ఒక సినిమా విడుదలయ్యే లోపే మరో సినిమాను ప్రకటిస్తాడు సందీప్‌కిషన్. ఎప్పుడు ఏ సినిమా ప్రకటిస్తాడో..ఏ షూటింగ్ లో పాల్గొంటాడో చెప్పడం కష్టమే. ఇటీవలే ఏ1 ఎక్స్‌ప్రెస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్‌కిషన్ తన నెక్ట్స్ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించాడు. సందీప్ కొత్త సినిమా గల్లీ రౌడీ. ఈ చిత్రంలో మీసాల వాసు అనే పాత్రలో కనిపింబోతున్నాడట.
గల్లీ రౌడీ ఫస్ట్ లుక్‌ను అందరితో పంచుకున్నాడు సందీప్. స్టైలిష్ కళ్లద్దాలు పెట్టుకుని గల్లీలో పరుగెడుతున్న ఫస్ట్ లుక్ స్టిల్ ఆకట్టుకుంటోంది. నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. జీ నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్టును ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్ సమర్పిస్తున్నారు.
కోలీవుడ్ యాక్టర్ బాబీ సింహా కీ రోల్ పోషిస్తున్నాడు. మే 21న థియేటర్లలో సందడి చేయనున్నాడు గల్లీరౌడీ. రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణ మురళి, వైవా హర్ష, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Take pleasure in presenting to you my quirkiest character to Date…
— Sundeep Kishan (@sundeepkishan) April 4, 2021
Rowdy By Nepotism…
World Famous in Vizag …#GullyRowdy #MeesalaVaasu
Promise you a Laugh Riot 🔥
This May 21st 🤟🏽@KonaFilmCorp @MVVCinema_ pic.twitter.com/Lwww2J7kQI