తెలుగమ్మాయి సుమయరెడ్డి కథానాయికగా నటిస్తూ నిర్మించిన ఫీల్‌గుడ్ ఎమోషనల్ లవ్‌స్టోరీ ‘డియర్ ఉమ’. ఈ సినిమాకు రచయిత కూడా ఆమే కావడం విశేషం. సాయిరాజేష్ మహాదేవ్ దర్శకుడు. ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ విషయాన్ని ఆదివారం మేకర్స్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఇప్పటివరకూ విడుదల చేసిన ప్రచార చిత్రాల వల్ల సినిమాపై అంచనాలు పెరిగాయని, ఇందులో అద్భుతమైన ప్రేమకథతోపాటు చక్కని సందేశం కూడా ఉంటుందని, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిన ఈ చిత్రంలో సగుటు ప్రేక్షకుడికి కావాల్సిన అంశాలన్నీ ఉంటాయని మేకర్స్ తెలిపారు. పృధ్వీ అంబర్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, సప్తగిరి, అజయ్‌ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల, రూపలక్ష్మి, తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: రధన్, నిర్మాణం: సుమ చిత్ర ఆర్ట్స్.