అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటిస్తున్న కామెడీ లవ్‌స్టోరీ ‘సుమతి శతకం’. ఎం.ఎం.నాయుడు దర్శకుడు. సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాత. ఫిబ్రవరి 6న సినిమా విడుదల కానున్నది. మైత్రీ మూవీస్ వారు రెండు తెలుగు రాష్ర్టాల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తిరుపతిలో ఘనంగా జరిగింది. ‘నిర్మాత సాయిసుధాకర్ ఖర్చుకు వెనుకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. హీరో అమర్దీప్ పక్కింటబ్బాయిలా కనిపిస్తూ అద్భుతమైన నటన కనపరిచాడు. కామెడీగా సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. డివోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఫిబ్రవరి 6న విడుదలయ్యే ఈ సినిమా మీ అంచనాలకు మించి ఉంటుంది’ అని దర్శకుడు ఎం.ఎం.నాయుడు అన్నారు. పక్కా కామెడీతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఈ సినిమా ఆకట్టుకుంటుందని నిర్మాత సాయి సుధాకర్ తెలిపారు. ఇంకా హీరోహీరోయిన్లు అమర్దీప్, శైలి చౌదరి కూడా మాట్లాడారు.