‘పెళ్లి పట్ల సదభిప్రాయం లేని యువకుడతడు. వివాహ జీవితమంటే ఓ అలర్జీ అనే భావనలో ఉంటాడు. సోలో లైఫ్ సో బెటర్ అని తీర్మానించుకొని ఏకాకిలా బతికేస్తుంటాడు. అతడి రిలేషన్షిప్ స్టేటస్ అందరికీ ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఆ యువకుడి కథేమిటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు సుమంత్. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘మళ్ళీ మొదలైంది’. టి.జి. కీర్తికుమార్ దర్శకుడు. కె. రాజశేఖర్‌రెడ్డి నిర్మాత. నైనా గంగూలీ కథానాయిక. సుమంత్ ఫస్ట్‌లుక్‌ను శనివారం చిత్రబృందం విడుదలచేసింది. ‘మోస్ట్ కన్ఫ్యూజ్డ్ డివోర్సి’ పేరుతో విడుదలచేసిన లుక్‌లో క్లాస్‌గా సుమంత్ కనిపిస్తున్నారు. పెళ్లి, విడాకులు అనే అంశాల్లో ఉండే సందిగ్ధతను ఆవిష్కరిస్తూ ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో ప్రేక్షకుల ముందుకురానున్నది. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్.