Suma kanakala | యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీప్రేక్షకుల నుంచి సినీ సెలబ్రిటీస్ వరకు ఈమె యాంకరింగ్‌కు ఫిదా అవ్వని వారుండరు. సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్గాని, ప్రీ రిలీజ్ ఈవెంట్ గాని ఈమె లేకపోతే చప్పగా ఉంటుంది. ఈమె కామెడీ టైమింగ్‌తో బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా కొనసాగుతుంది. ఈమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్ కుమార్ కలివరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను స్టార్ హీరో రామ్ చరణ్ విడుదల చేయగా ఫస్ట్‌సింగిల్‌ను నాని విడుదల చేశాడు. ఈ చిత్ర టీజర్‌ను భళ్లాళదేవుడు రానా విడుదల చేశాడు. ఇలా ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి విషయాన్ని సెలబ్రిటీస్ షేర్ చేయడంతో సినిమాపై బజ్ అమాంతం పెరిగింది. ఈ క్రమంలో సుమ పారితోషికం విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక సుమ ప్రతి ఈవెంట్‌కు హోస్టింగ్ చేయడానికి లక్షన్నర దాకా తీసుకుంటుందని టాక్. ఇక ఈ చిత్రానికి సుమ 50లక్షల వరకు రెమ్యునరేషన్‌ను అందుకుందని సమాచారం. ఈమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు ఇంత మొత్తం పారితోషకాన్ని ఇచ్చారట.
‘జయమ్మ పంచాయితీ’ చిత్రంతో సుమ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది. గతంలో ఈమె ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ అనే సినిమాతో హీరోయిన్గా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తరువాత రెండు మూడు మలయాళ సినిమాల్లో నటించింది. పవిత్ర ప్రేమ, చాలా బాగుంది, వర్షం, ఢీ, బాద్షా వంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. తెలుగులో ఈమె పట్టుకుంటే పట్టుచీర ప్రోగ్రాంతో బాగా ఫేమస్ అయింది.