అది ఓ పజిల్

‘రోబోటిక్స్ ఇంజినీర్ అయిన ఓ యువకుడు తన స్వభావానికి విరుద్ధంగా ఉండే వంద మంది వ్యక్తులతో కలిసి సాగించిన ప్రయాణం నేపథ్యంలో ఆసక్తికరంగా సినిమా సాగుతుంది. ముంబయిలో ఉండే అతడు ఏ లక్ష్యం కోసం పల్లెటూరికి వచ్చాడన్నది థ్రిల్‌ను పంచుతుంది’ అని అన్నారు బక్కియరాజ్ కణ్ణన్. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘సుల్తాన్’. కార్తి, రష్మిక మందన్న జంటగా నటించారు. ఏప్రిల్ 2న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా బక్కియరాజ్ కణ్ణన్ మాట్లాడుతూ ‘సుందర్.సి, అట్లీ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశా. శివకార్తికేయన్ హీరోగా నటించిన ‘రెమో’ చిత్రంతో మెగాఫోన్ పట్టాను. దర్శకుడిగా నా రెండో చిత్రమిది. అమరావతి సమీపంలోని చిన్నపల్లెటూరిలో జరిగే కథ ఇది. యాక్షన్, ప్రేమ, భావోద్వేగాల కలబోతగా ఉంటుంది.
ఓ పజిల్లా ఉంటుంది..
కథ చెప్పడం మొదలుపెట్టిన ఇరవై నిమిషాల్లోనే కార్తి ఈ సినిమా చేస్తానని అన్నారు. ఈ సినిమాతో రష్మిక మందన్న తమిళంలో అరంగేట్రం చేస్తోంది. సాటివారికి సాయపడే మంచి గుణమున్న విద్యావంతురాలైన పల్లెటూరి యువతిగా నటనకు ఆస్కారమున్న పాత్ర ఆమెది. ఇందులో విలన్ ఎవరనేది ప్రేక్షకుల ఊహలకు అందకుండా ఓ పజిల్లా ఉంటుంది. కమర్షియల్ సినిమాల్ని ప్రేక్షకుల్ని మెప్పించేలా జనరంజకంగా తీయడానికి ఎంతో నేర్పు కావాలి. ఆ విషయంలో తెలుగు దర్శకులు ప్రావీణ్యులు అని నా నమ్మకం.
ఇవి కూడా చదవండి:
ఈ సంతోషం కోసం మూడేళ్లు ఎదురుచూశాం!
తెలుగులో నిహారిక కొణిదెల నటించిన తమిళ చిత్రం
అండర్‌వరల్డ్ గ్రూప్ నేపథ్యంలో ‘శుక్ర’
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

