శుక్ర, మాటరాని మౌనమిది చిత్రాల దర్శకుడు సుకు పూర్వాజ్ తన చిత్రం ‘ఏ మాస్టర్ పీస్’కు ఇటీవల శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సూపర్‌హీరో బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ కండ్రేగుల నిర్మాత. మంగళవారం ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘హాలీవుడ్ రేంజ్లో సరికొత్త కంటెంట్, ప్రజెంటేషన్‌తో రూపొందనున్న చిత్రమిది. పిల్లలకు ఎంతో ఇష్టమైన సూపర్‌హీరోను మన తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం చేస్తున్నాం. ఏప్రిల్ వరకు జరిగే చిత్రీకరణతో షూటింగ్ పూర్తిచేస్తాం’ అన్నారు. అరవింద్ కృష్ణ, బిగ్‌బాస్ ఫేమ్ ఆషురెడ్డి, స్నేహగుప్త తదితరులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.