కవితాత్మక ప్రేమకథకు శ్రీకారం
హీరో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న పదవ చిత్రం బుధవారం ప్రారంభమైంది.
హీరో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న పదవ చిత్రం బుధవారం ప్రారంభమైంది. పొయెటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కనున్న ఈ చిత్రం ద్వారా మోహన్.బి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సుకుమార్ రైటింగ్స్, బన్నీవాస్ వర్క్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నయన్ సారిక కథానాయికగా నటిస్తున్నది. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర దర్శకుడు సుకుమార్ కెమెరా స్విఛాన్ చేయగా, అల్లు అరవింద్ క్లాప్‌కొట్టారు. ఈ సందర్భంగా విడుదల చేసిన థీమ్ పోస్టర్ సినిమా కథా ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ పొయెటిక్ ఫీల్‌తో ఆకట్టుకుంది.
సుకుమార్ బృందంలో కీలక సభ్యుడిగా ఉన్న దర్శకుడు మోహన్.బి ఈ సినిమా కోసం ఓ అందమైన, కవితాత్మక భావనలతో సాగే ప్రేమకథను సిద్ధం చేశారని, సిద్ధు జొన్నలగడ్డ పాత్ర చిత్రణ నవ్యరీతిలో ఉంటుందని మేకర్స్ తెలిపారు. షూటింగ్ త్వరలో ప్రారంభంకానున్న ఈ చిత్రానికి కెమెరా: చంద్రు సెల్వరాజ్, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, నిర్మాతలు: అన్మోల్ శర్మ, బన్నీ వాసు, అశోక్ బండ్రెడ్డి, దర్శకత్వం: మోహన్.బి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

