Pushpa : The Rule | టాలీవుడ్ మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ పుష్ప.. ది రూల్ (Pushpa : The Rule). సుకుమార్ (Sukumar) -అల్లు అర్జున్ (Allu Arjun) కాంబినేషన్లో పుష్ప.. ది రైజ్‌కు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీ మరోసారి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం పుష్పరాజ్ టీం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఉంది.
అల్లు అర్జున్ సహా ఇతర యాక్టర్ల మధ్య వచ్చేయాక్షన్ సన్నివేశాలను ఈ చిన్న షెడ్యూల్లో చిత్రీకరిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. మారేడుమిల్లితోపాటు ఒడిశా పరిసర ప్రాంతాల్లో తాజా షెడ్యూల్ కొనసాగుతోంది. ఈ షెడ్యూల్ తర్వాత బన్నీ టీం నయా షెడ్యూల్లో భాగంగా విదేశాలకు వెళ్లనుంది. యూరప్‌తోపాటు బ్యాంకాక్‌లో కీలక సన్నివేశాలను షూట్ చేయబోతున్నారని సమాచారం.షూటింగ్ లొకేషన్లో ఫారెస్ట్ ఆఫీసర్లతో ఫహద్ ఫాసిల్ అండ్ సుకుమార్ టీం ఉన్న స్టిల్స్ కొన్ని నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
పుష్ప.. ది రూల్ చిత్రాన్ని 2024 ఫస్ట్ హాఫ్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. విడుదల తేదీపై సరైన సమయంలో క్లారిటీ ఇవ్వనున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సీక్వెల్లో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా మరోసారి శ్రీవల్లిగా సందడి చేయనుంది.
సీక్వెల్లో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, సునీల్, ధనుంజయ, రావు రమేష్, అనసూయ భరద్వాజ్‌తోపాటు ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి సీక్వెల్‌కు అదిరిపోయే ఆల్బమ్ రెడీ చేసినట్టు ఇప్పటికే సుకుమార్ టీం అప్డేట్ ఇచ్చేసింది.
Latest clicks of Sukumar & #FahadhFaasil from #Pushpa2TheRule shooting spot.. !!
Around 35% shoot completed.@aryasukku cooking India’s Most Awaited Biggie silent,slow & with more determination.. 😉🔥@alluarjun #PushpaTheRule pic.twitter.com/9Ld0Hn84f9
— Adopted Son Of Kerala (@ASOKERALA) May 16, 2023