సుధీస్, అంకిత జంటగా నటిస్తున్న ఎమోషనల్ లవ్‌స్టోరీ ‘పేషన్’. అరవింద్ జాషువా దర్శకుడు. నరసింహా యేలే, ఉమేష్ చిక్కు, రాజీవ్ సింగ్ నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానుంది. క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. ‘పెద్దపెద్ద వాళ్ల పిల్లలు చదివే ఓ ఫ్యాషన్ కాలేజీలో ఓ సామాన్యుడు చదివితే ఎలా ఉంటుందో ఫీలై ఈ కథ రాశా.
ఇంటెన్స్ ఎమోషన్స్‌తో కూడిన ప్రేమకథ ఇది. నిర్మాతలు ఎంతో సహకరించారు. డివోపీ నటరాజన్ సినిమాకు మెయిన్ పిల్లర్. సాంకేతికంగా ఉన్నతంగా ఉంటుందీ సినిమా. ఈ జనరేషన్‌కి బాగా కనెక్టయ్యే సినిమా ఇది’ అని దర్శకుడు అన్నారు. మరో అతిథి ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్ కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: సామ్ హెన్రీ.