సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పీ జంటగా నటిస్తున్న చిత్రం ‘గాలోడు’. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడు. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల సన్నాహాల్లో ఉంది.
తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. ‘నీ కళ్లే దివాళి..’ అని సాగే ఈ పాటను భీమ్స్ సిసిరోలియో స్వరకల్పనలో శ్రీనివాస తేజ సాహిత్యాన్ని అందించగా..షాహిద్ మాల్య పాడారు. ఈ పాట సినిమాకు ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం చెబుతున్నారు. సప్తగిరి, పృథ్వీరాజ్, షకలక శంకర్, సత్య కృష్ణ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.