Hunt Movie First Single | ఎంతో కాలంగా టాలీవుడ్లో హీరోగా మంచి గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న సుధీర్‌బాబుకు ‘సమ్మోహనం’ బిగ్ బ్రేక్ ఇచ్చింది. ఈ చిత్రంతో సుధీర్‌బాబు హీరోగా రీ-ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత సుధీర్ కథల ఎంపికలో చాలా మార్పులు వచ్చాయి. కేవలం కంటెంట్ ప్రధానంగా ఉన్న కథలనే ఎంచుకుంటూ టాలీవుడ్లో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఈయన నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ విడుదలై యావరేజ్‌గా నిలిచింది. ఇక ప్రస్తుతం ఈయన మూడు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. అందులో హంట్ ఒకటి.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మహేష్ దర్శకత్వం వహించాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. కాగా ఈ చిత్రం నవంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై విపరీతమై అంచనాలు క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో ని పాపతో పైలం అంటూ సాగే మస్ బీట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. జిబ్రాన్ స్వర పరిచిన ఈ పాటను మంగ్లీ, నకాష్ అజీజ్ ఆలపించగా.. కాసర్ల శ్యామ్ రచించాడు. సుధీర్‌బాబుతో కలిసి అప్సరరాణి ఈ పాటకు చిందులేసింది. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్, తమిళ నటుడు భరత్ కీలకపాత్రలు పోషించారు.
Read Also:
S.S Rajamouli | రాజమౌళి ఒక్కో సినిమా అన్ని కోట్లు కలెక్ట్ చేసిందా?
అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Siva Karthikeyan | నాగచైతన్య దర్శకుడితో.. శివ కార్తికేయన్ నెక్స్ట్ చిత్రం..!
Ponniyin Selvan-1 | ‘400కోట్ల’ క్లబ్‌లోకి ‘పొన్నియన్ సెల్వన్’ ఎంట్రీ..!