Maama Mascheendra Movie | టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ఫలితంతో సంబంధంలేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. కెరీర్ బిగెనింగ్ నుంచి కథా బలమున్న సినిమాలు చేస్తున్నా కమర్షియల్ హీరో స్టేటస్‌ను మాత్రం దక్కించుకోలేకపోతున్నాడు. సుధీర్ సినిమాలు జనాలు బాగానే ఆధరిస్తున్నా.. కమర్షియల్ హిట్లు మాత్రం కాలేకపోతున్నాయి. గతేడాది వచ్చిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా తొలిరోజు పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం వెనకబడిపోయింది. ఇక ఇటీవలే వచ్చిన హంట్ సుధీర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం సుధీర్‌బాబు ఆశలన్నీ మామా మశ్చీంద్రా సినిమాపైనే ఉన్నాయి.
ప్రముఖ కమెడియన్, అమృతం ఫేమ్ హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమాలో సుధీర్ మూడు విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నాడు. రెండు పాత్రలకు సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే రిలీజ్ కాగా.. వాటికి విశేష స్పందన వచ్చింది. కాగా చిత్రబృందం తాజాగా మూడో పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. డీజేగా సుధీర్‌బాబు లుక్ అదిరిపోయింది. డీజే లుక్‌లో సుధీర్ అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ఇక ఈ మూడు పాత్రలతో సినిమాపై ఎక్కడలేని హైప్ క్రియేట్ అయింది.
కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుధీర్ బాబుకు జోడీగా ఈషా రెబ్బా, మృనాళిని రవి నటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.
The coolest of 'em all! 😎 Meet DJ#MaamaMascheendra#SBasDJ@HARSHAzoomout @YoursEesha @mirnaliniravi @chaitanmusic @pgvinda @AsianSuniel @puskurrammohan @SVCLLP #SrishtiCelluloids pic.twitter.com/HdExLjzbHb
— Sudheer Babu (@isudheerbabu) March 7, 2023