కరోనా వలన థియేటర్స్‌కి వెళ్లే పరిస్థితులు లేవు. సినీ ప్రేక్షకులు కూడా పెద్దగా థియేటర్స్‌కి వెళ్లడం లేదు అలాంటప్పుడు సెలబ్స్ రిస్క్ చేసి థియేటర్స్‌కి వెళతారా అస్సలు వెళ్లరు. ఇంట్లోనే హోమ్ థియేటర్లో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా మహేష్ బాబు తన ఇంట్లో బావ సుధీర్ బాబు నటించిన తాజా చిత్రాన్ని వీక్షించి ట్విట్టర్లో ప్రశంసలు కురిపించారు.
సుధీర్ బాబు హీరోగా రూపొందిన శ్రీదేవీ సోడా సెంటర్ నిన్న (ఆగస్ట్ 27) విడుదలైంది. పలాస సినిమాతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కరుణకుమార్ తన రెండో ప్రయత్నంతో శ్రీదేవీ సోడా సెంటర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులోని క్లైమాక్స్ ఉప్పెన తరహాలోని క్లైమాక్స్‌ను తలపించేలా ఉంది.ఈ సినిమాని స్పెషల్‌గా వీక్షించిన మహేష్…శ్రీదేవీ సోడా సెంటర్ రా అండ్ ఇంటెన్స్ సినిమా.. దాంతో పాటు అదిరిపోయే క్లైమాక్స్ ఉందని కామెంట్ చేశారు.
పలాస తరువాత మళ్లీ దర్శకుడు కరుణ కుమార్ అద్భుతమైన బోల్డ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సుధీర్ బాబు అద్భుతంగా నటించేశారు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలలో ఇది బెస్ట్‌గా అనిపిస్తుంది . నరేష్ గారు ఎప్పటిలానే అవలీలగా,అద్భుతంగా చేసేశారు. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్ ఆనంది. శ్రీదేవీ పాత్రలో సరిగ్గా సరిపోయారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దుమ్ములేపేసింది. అది మిస్ కాకూడదు. టీం అందరికీ కంగ్రాట్స్’ అని మహేష్ బాబు ట్వీట్ లో పేర్కొన్నారు. ఇందుకు సుధీర్ బాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గోదావరి నేపథ్యంలో ప్రేమకథతో పాటు.. యాక్షన్ ఛేజ్ లతో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా శ్రీదేవి సోడా సెంటర్ చిత్రం రూపొందింది.
Thank you Mahesh. Not just for the tweet but also for your unfiltered & detailed explanation 😀 … My entire team is on cloud 9 looking at this. #SrideviSodaCenter #AudienceHIT#ResoundingBLOCKBUSTER https://t.co/1DPUuLzDVI
— Sudheer Babu (@isudheerbabu) August 28, 2021