Maama Mascheendra Movie | ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిచ్చే నటులలో సుధీర్‌బాబు ఒకడు. ఆరుపలకల దేహంతో అల్ట్రాస్టైలిష్గా కనిపించే సుధీర్‌బాబు తన తదుపరి సినిమా కోసం లడ్డుబాబులా మేకోవర్ అయ్యాడు. ప్రస్తుతం సుధీర్‌బాబు హర్షవర్ధన్ దర్శకత్వంలో ‘మామా మశ్చీంద్రా’ సినిమా చేస్తున్నాడు. టైటిల్ పోస్టర్ నుంచే ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక ఇటీవలే సినిమా నుండి లీకైన వీడియో నెట్టింట సంచలనమే రేపింది. ఒక్కసారిగా సుధీర్‌బాబు లావుగా కనిపించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. కాగా తాజాగా చిత్రయూనిట్ అఫియల్‌గా సుధీర్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
ఈ సినిమాలో సుధీర్ మూడు గెటప్స్‌లో కనిపించనున్నట్లు చిత్రబృందం ఇటీవలే వెల్లడించింది. కాగా అందులో మొదటి గెటప్‌కు సంబంధించిన పోస్టర్ రిలీజైంది. దుర్గ పాత్రలో బొద్దుగా ఉన్న సుధీర్‌బాబు లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పోస్టర్‌తోనే సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయ్యాయి. ‘అమృతం’ సీరియల్‌తో మంచి పాపులారిటీ తెచ్చుకున్న హర్షవర్ధన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీవెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Bet you didn't see this coming 😉 Meet Durga! #MaamaMascheendra@HARSHAzoomout @chaitanmusic @pgvinda #SunielNarang @puskurrammohan @SVCLLP #SrishtiCelluloids pic.twitter.com/IWhVydn4ie
— Sudheer Babu (@isudheerbabu) March 1, 2023