ఈగ, బాహుబలి, సైరా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కన్నడ హీరో సుదీప్ కిచ్చా (Kichcha Sudeep). ప్రస్తుతం అనూప్ భందారి దర్శకత్వంలో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కిన విక్రాంత్ రోన (Vikrant Rona) చిత్రంలో నటిస్తున్నాడు. విక్రాంత్ రోన జులై 28న (గురువారం) ప్రపంచవ్యాప్తంగా కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో చిత్రయూనిట్‌కు పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి (SS Rajamouli) విషెస్ తెలియజేశాడు.
సుదీప్ ప్రయోగాలు చేయడంలో, సవాళ్లను స్వీకరించడంలో ఎప్పుడూ ముందుంటాడు. #VikrantRonaలో అతడేం చేశాడో చూసేందుకు వెయిట్ చేయలేము. విజువల్స్ గ్రాండ్‌గా కనిపిస్తున్నాయి. రేపు సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో కిచ్చా సుదీప్ టీంకు నా శుభాకాంక్షలు..అని రాజమౌళి ట్వీట్ చేశాడు.
ఇపుడీ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. విక్రాంత్ రోన చిత్రంలో నిరూప్ భందారి, బాలీవుడ్ భామ జాక్వెలీన్ ఫెర్నాండెజ్ కీలకపాత్రల్లో నటించారు.ఈ చిత్రాన్ని షాలిని ఆర్ట్స్, ఇన్వేనియో ఫిలింస్ ఇండియా సంస్థల భాగస్వామ్యంతో సుదీప్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.
Read Also : DJ Tillu 2 | డీజేటిల్లు 2 డైరెక్టర్‌గా రామ్..క్రేజీ న్యూస్‌లో నిజమెంత..?
Read Also : Atal Bihari Vajpayee Look | ‘ఎమర్జెన్సీ’ నుంచి అటల్ బిహారీ వాజ్‌పేయి లుక్
Read Also : Bimbisara Release Trailer | బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరింది..’బింబిసార’ రిలీజ్ ట్రైలర్