ఐసియూలో బెడ్ దొరక్క మెగా దర్శకుడి తల్లి కన్నుమూత

కరోనా వైరస్ బయట ఎంత దారుణంగా ఉందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజుకు కొన్ని వేలాది మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో పలువురు ప్రముఖులు కూడా ఉంటున్నారు. రోజుకు కనీసం అరడజను మంది ప్రముఖులు మరణించడం రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో సినీ ప్రముఖుడి ఇంట ఇంకా ఈ వైరస్ విషాదం నింపింది. సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సుబ్బు తన తల్లి మంగమ్మ గారిని పోగొట్టుకున్నాడు. వైరస్ బారిన పడి ఆమె మే 16 రాత్రి మరణించారు. కేవలం ఐసీయూలో బెడ్ దొరక్కపోవడంతో ఈమె ప్రాణాలు కోల్పోయారు. దేశంలో సామాన్యుడైన, ప్రముఖులైన ప్రస్తుతం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు.
అక్కడ ఐసియు కోసం నానా తంటాలు పడుతున్నారు. ఒక బెడ్ కావాలి అంటూ రికమండేషన్స్ పెట్టుకుంటున్నారు. అయినా కూడా పరిస్థితులు సహకరించడం లేదు. కావాల్సిన వాళ్లను పోగొట్టుకుంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. మొన్నటికి మొన్న సీనియర్ నటుడు గౌతమ్ రాజు తమ్ముడు సిద్ధార్థ ఇలాగే ఆక్సిజన్ కొరతతో మరణించారు. అలాగే హీరోయిన్ పియా బాజ్ పేయి సోదరుడు కూడా ఆక్సిజన్ దొరక్క మరణించాడు. ఇప్పుడు సుబ్బు తల్లి కూడా ఇలాగే ప్రాణాలు కోల్పోయారు. సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో ఈయన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలి సినిమా విడుదలైనప్పుడు తన తల్లికి చూపించి ఎంతో సంతోషపడ్డాడు. అలాంటిది ఇప్పుడు ఆయన తల్లి మరణించడంతో ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు దర్శకుడు సుబ్బుకు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఆర్టీపీసీఆర్లో తేలకుంటే మరో టెస్టు
చేయని తప్పుకు శిక్ష.. 550 కోట్ల పరిహారం!
గుజరాత్లో భూకంపం
ఉస్మానాబాద్ జైలులో 133 మంది ఖైదీలకు కరోనా
విషాదం : హైదర్‌గూడలో అగ్ని ప్రమాదం.. ఒకరు సజీవ దహనం
తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయం.. భక్తులకు నో ఎంట్రీ
జగన్నాథుడి దర్శనం.. జూన్ 15 వరకు బంద్
వచ్చే ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొత్త భవనంలోనే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

