N62 | బార్లో అల్లరి నరేశ్, డైరెక్టర్ సుబ్బు సిట్టింగ్.. N62 అనౌన్స్మెంట్ అదిరింది
N62 | టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా కోస్టార్లు, ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బర్త్ డే సందర్భంగా ముందుగా వచ్చిన అప్డేట్ ప్రకారం ఇవాళ N62 (Naresh62) చిత్రానికి సంబంధించిన వార్త బయటకు వచ్చింది.
N62 | అల్లరి సినిమాతో హీరోగా బ్రేక్ అందుకుని.. ఈ సినిమా పేరునే సర్‌నేమ్‌గా మార్చేసుకున్నాడు టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ (Allari Naresh). సక్సెస్ ఫుల్‌గా కెరీర్ సాగిస్తున్న అల్లరి నరేశ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా కోస్టార్లు, ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బర్త్ డే సందర్భంగా ముందుగా వచ్చిన అప్డేట్ ప్రకారం ఇవాళ N62 (Naresh62) చిత్రానికి సంబంధించిన వార్త బయటకు వచ్చింది.
సోలో బ్రతుకే సో బెటర్ ఫేం సుబ్బు మంగాదేవి N62 చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ముందుగా కథ చెప్పేందుకు నరేశ్‌కు ఫోన్ చేస్తాడు డైరెక్టర్ సుబ్బు . అయితే కథ ఎక్కడ చెప్తావని నరేశ్ అడిగితే.. ఫైనల్‌గా నరేశ్‌తో బార్లో సిట్టింగ్ వేయిస్తాడు డైరెక్టర్ సుబ్బు. కథ ఏంటని నరేశ్ అడిగితే.. మూర్ఖత్వంతో బతికే ఓ వ్యక్తి కథే స్టోరీ లైన్ అని చెప్పేశాడు సుబ్బు. నరేశ్ కూడా చేసేద్దాం.. అంటూ ఈ సినిమాకు మంచి టెక్నీషియన్స్ కావాలని అడిగితే.. డైరెక్టర్ వారిని కూడా ఒక్కొక్కరిగా పరిచయం చేశాడు. ఇంట్రెస్టింగ్ సంభాషణతో సాగుతున్న N62 అనౌన్స్మెంట్ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
నరేశ్ 62 చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా, బాలాజీ గుట్ట తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. అల్లరి నరేశ్ ఇప్పటికే 61 (Naresh61)వ చిత్రాన్ని కూడా ప్రారంభిండాని తెలిసిందే. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ మూవీని డెబ్యూ డైరెక్టర్ మల్లి అంకం డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో జాతి రత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రానికి అబ్బూరి రవి సంభాషణలు అందిస్తుండగా.. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.
N62 అనౌన్స్మెంట్..
‘Moorkathvam border daatina okadi jeevitha katha’
Happy Birthday to our hero @allarinaresh ❤️
Presenting #Naresh62 Sitting!
– https://t.co/xOzFLTeiylA film by @subbucinema 🎬@RajeshDanda_ @_balajigutta @Composer_Vishal @ChotaKPrasad @brahmakadali @richardmnathan pic.twitter.com/xHovQxCNCY
— Hasya Movies (@HasyaMovies) June 30, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

