టాలీవుడ్ (Tollywood) హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) నటిస్తోన్న తాజా చిత్రం స్టూవర్ట్‌పురం దొంగ (Stuartpuram Donga). దీపావళి సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. గుబురు గడ్డంతో చేతిలో గన్స్ పట్టుకుని సీరియస్‌గా కనిపిస్తున్న బెల్లంకొండ లుక్ స్టన్నింగ్‌గా ఉంది. రగ్డ్ గెటప్‌లో బెల్లంకొండ సరికొత్తగా కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తున్నాడు.
1970లో స్టూవర్ట్‌పురంలో ధైర్యవంతుడైన దొంగగా పేరుగాంచిన ‘టైగర్ ’ నాగేశ్వర్ రావు (‘Tiger’ Nageswara Rao) బయోపిక్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. వివి వినాయక్ సన్నిహితుడు కేఎస్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీ లక్ష్మినరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు.
70-80ల బ్యాక్ డ్రాప్లో సాగే ఈ ప్రాజెక్టుకు వెన్నెలకంటి సోదరులు రైటర్స్. మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్. శ్యామ్ కే నాయుడు కెమెరా వర్క్ చేస్తుండగా..తమ్మిరాజు ఎడిటర్, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్.
The Ferocious Tiger 🐯 is HERE!! 💥
— BA Raju's Team (@baraju_SuperHit) November 4, 2021
Presenting you First look of @BSaiSreenivas from#StuartpuramDonga ⚔️🔥
A Film By #KS #BSS10 #vennelakantiBrothers #ManiSharma #ShyamKNaidu #Thammiraju #ASPrakash #BellamkondaSuresh #SreeLakshmiNarsimhaProductions #HappyDiwali pic.twitter.com/x7sRRVXLjL
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
SS Rajamouli wish suryavanshi team | మొన్న అల్లు అర్జున్..నేడు రాజమౌళి
Samantha Super heroes | ఆ సూపర్ హీరోలకు సమంత సపోర్ట్..ఆసక్తిగా వెయిటింగ్
Keerthy Suresh Selfie | అందాల తారలతో కీర్తిసురేశ్ సెల్ఫీ
Rajasekhar Sankranthi race | సంక్రాంతి రేసులో రాజ ‘శేఖర్’..?