అల్లుడు శీను చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శీను వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రాక్షసుడు చిత్రం ఆయన కెరీర్లో బెస్ట్ మూవీ కాగా, ఇప్పుడు చేస్తున్న స్టూవర్ట్ పురం దొంగ అనే చిత్రం అంతకుమించి అనేలా కనిపిస్తుంది. 1970 లలో స్టువర్ట్ పురంలో పేరుమోసిన సాహసోపేతమైన దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది.
దీపావళి కానుకగా ‘స్టూవర్ట్ పురం దొంగ’ కొత్త పోస్టర్ తో దిగిపోయాడు బెల్లంకొండ శీను. క్రూరమైన దొంగగా బెల్లంకొండ శ్రీనివాస్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. రెండు రైఫిల్స్ ని చేతపట్టి, భయంకరమైన చూపు చూస్తూ కనిపించాడు. తాజాగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు.ఇందులో గుబురు గడ్డంతో తెగ భయపెటట్టిస్తున్నాడు. బెల్లంకొండ ఇంటెన్స్ లుక్స్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
మాస్ డైరెక్టర్ వివి వినాయక్ సహచరుడు కెఎస్ తొలి చిత్ర దర్శకుడిగా దీనిని తెరకెక్కించనున్నాడు. ప్రతిష్టాత్మక బ్యానర్ శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా కేటగిరీలో పలు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారని సమాచారం.