అన్నాత్తె సెట్లో కఠినంగా కరోనా ఆంక్షలు..!

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న చిత్రం అన్నాత్తె. గత ఏడాది డిసెంబర్లో ఈ చిత్ర షూటింగ్‌కు బ్రేక్ పడ్డ సంగతి తెలిసిందే.సెట్లో పలువురికి కరోనా రావడంతో పాటు రజనీకాంత్ కూడా అనారోగ్యానికి గురి కావడంతో మూవీకి తాత్కాలిక బ్రేక్ వేశారు. దీపావళికి చిత్రాన్ని విడుదల చేయాలనే ఉద్దేశంతో మూవీ షూటింగ్‌ని ఇటీవల హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభించారు.
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్నాత్తె సెట్లో అనేక ఆంక్షలు విధించారు. సినిమాటోగ్రాఫర్‌తో సహా ప్రతి ఒక్కరు పీపీఈ కిట్స్ ధరించాలి. ఎవరైన రజనీకాంత్‌కు పది అడుగుల దూరం నుండే మాట్లాడాలి. రజనీకాంత్‌తో నటించే ఆర్టిస్టులు ఎవరైన ఉంటే వారు ఆ సమయానికి షాట్లో పాల్గొని, వెంటనే వారికి కేటాయించిన గదులకు వెళ్లిపోవాలి. దర్శకుడు శివ కూడా రజనీకాంత్‌కు నాలుగు అడుగుల దూరం ఉండి సీన్ వివరిస్తున్నారట. రజనీకాంత్ వ్యక్తిగత సహాయకులు మాత్రమే అతనికి మేకప్ వేయడం, ఇతర పనులన్నింటిని చూసుకుంటున్నారట. 70 ఏళ్ల వయస్సులో రజనీకాంత్ మూవీ కోసం ఇంతటి రిస్క్ చేస్తుండడం చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.
ఇవికూడా చదవండి..
భారత ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు
గుజరాత్ కొవిడ్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి
టీకా ఉచితంగా ఎందుకివ్వరు?
18+కు వ్యాక్సినేషన్ వాయిదా!
భారత్‌కు కరోనా టీకా ఫార్ములాను ఇవ్వొద్దు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Annaatthe
- carona
- rajinikanth
RELATED ARTICLES
తాజా వార్తలు
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

