Shah Rukh Khan | జీవితంలో డబ్బు, స్టార్డమ్ కంటే ఒత్తిడి లేకుండా ఉండడమే ముఖ్యమని అంటున్నాడు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్. తన జీవితంలో జరిగి విషాద సంఘటన వలన తనకు డబ్బు, ఫేమ్ కంటే మానసికి ఒత్తిడి లేకుండా ఉండడమే లైఫ్లో ఉత్తమమని పంచుకున్నాడు షారుక్. త్వరలో కింగ్ సినిమాతో ప్రేక్షకు ల ముందుకు రాబోతున్న ఆయన తాజాగా ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి పంచుకున్నాడు.
నా తల్లిదండ్రుల మరణం నా సోదరిపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ రోజు నా తండ్రి మృతదేహం ముందు నిలబడి ఆమె ఏ మాత్రం ఏడవలేదు, ఇప్పటికీ ఆ సంఘటన నాకు గుర్తుంది. దాదాపు రెండు సంవత్సరాల పాటు ఆమె ఆ మానసిక స్థితి నుంచి బయటపడలేకపోయింది. అందుకే నేను ఆమెలా డిప్రెషన్లో కూరుకుపోకుండా సినిమాల్లో నిమగ్నమై ఉంటాను. అందుకే జీవితంలో డబ్బు, కీర్తి కంటే ఒత్తిడి లేకుండా జీవించడమే నాకు ముఖ్యం అంటూ షారుక్ చెప్పుకోచ్చాడు.