స్టార్ హీరో చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ‘వాల్తేరు వీరయ్య’ ఈ చిత్రాన్ని మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు బాబీ రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ నాయికగా నటిస్తున్నది. మరో కీలక పాత్రలో హీరో రవితేజ కనిపించనున్నారు. పోర్ట్ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే కంప్లీట్ కమర్షియల్ చిత్రమిది. తాజాగా ఈ సినిమా నుంచి ‘బాస్ పార్టీ’ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేశారు. పార్టీ సాంగ్ ఆఫ్ ద ఇయర్‌గా ఈ పాటను వారు చెబుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపర్చి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను నకాష్ అజీజ్, హరిప్రియ పాడారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. గళ్ల లుంగీ, రంగు చొక్కాతో చిరు మాస్ స్టెప్పులు ఈ పాటకు ఆకర్షణ కాబోతున్నాయి. ఈ పాటలో చిరంజీవితో బాలీవుడ్ తార ఉర్వశీ రౌటేలా ఆడిపాడింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి పండుగకు తెరపై సందడి చేయనుంది.