Anudeep Katikala | హైదరాబాద్‌కు చెందిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉత్తరప్రదేశ్‌లో అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మరియు ఆయన విడాకుల అంశంపై అనుదీప్ తన కామెడీ షోలలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ మూడు వివాహాలను ప్రస్తావిస్తూ, అలాగే మెగా ఫ్యామిలీకి చెందిన నిహారిక కొణిదెల విడాకుల వ్యవహారాన్ని జోడిస్తూ అనుదీప్ చేసిన వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. దీనిపై తీవ్రంగా స్పందించిన జనసేన పార్టీ నాయకుడు బడే వెంకట కృష్ణ ఫిర్యాదు చేయడంతో, కాకినాడ I-టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
భారతీయ న్యాయ సంహిత (BNS) లోని పరువు నష్టం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం, మహిళల గౌరవానికి భంగం కలిగించడం వంటి సెక్షన్లతో పాటు ఐటి చట్టం కింద ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో తన కుటుంబంతో కలిసి పర్యటిస్తున్న అనుదీప్‌ను కాకినాడ పోలీసులు అక్కడే అదుపులోకి తీసుకున్నారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా కించపరచాలని ఈ వ్యాఖ్యలు చేయలేదని, కేవలం విడాకుల పట్ల సమాజంలో ఉన్న అభిప్రాయాలను ప్రశ్నించడమే తన ఉద్దేశమని అనుదీప్ ఇప్పటికే క్షమాపణలు కోరినప్పటికీ, వివాదం తీవ్రత దృష్ట్యా పోలీసులు చట్టపరమైన చర్యలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం పోలీసులు ఆయనను కాకినాడకు తరలిస్తున్నట్లు సమాచారం. అక్కడ విచారణ అనంతరం తదుపరి న్యాయపరమైన ప్రక్రియను చేపట్టనున్నారు.
How can you comment personally in the name of standup comedy on Telugu heros and in this video you commented on DCM @PawanKalyan
Mr @kanudeep95 if you want to get the fame this is not the right way. Better you join in politics pic.twitter.com/p8605F7NkY— Shiva (@Mygodshiva) April 10, 2026