SSMB 29 in Kenya | సూపర్ స్టార్ మహేష్ బాబు- విజనరి డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న SSMB 29 సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే భారతదేశంలో రెండు షెడ్యూల్లు పూర్తి చేసుకున్న ఈ భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ప్రస్తుతం కెన్యాలో మూడో షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమె కెన్యా నుంచి షేర్ చేసిన ఫోటోలు SSMB29 షూటింగ్ కెన్యాలోనే జరుగుతోందన్న వార్తలకు బలం చేకూర్చాయి.
తాజాగా దర్శకుడు రాజమౌళి, నిర్మాత KL నారాయణ , రాజమౌళి తనయుడు SS కార్తికేయ మరియు మూవీ టీమ్, కెన్యా విదేశాంగ మంత్రి ముసాలియా ముదావాది తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీకి సంబంధించి ఫోటోలు ముదావాది తన అధికారిక సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, ఈ మూవీపై అంతర్జాతీయంగా కూడా హైప్ పెరిగింది. రాజమౌళి గత రెండు దశాబ్దాలుగా ప్రపంచ సినీ ప్రేక్షకులను పవర్ ఫుల్ కథలతో, విజువల్స్‌తో ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆయన తూర్పు ఆఫ్రికాలో పలు ప్రాంతాలు పరిశీలించిన తర్వాత కెన్యా ని షూటింగ్ కోసం ఎంపిక చేయడం గర్వకారణం అని ముదావాది తన పోస్ట్‌లో రాసుకొచ్చారు
మసాయి మరా, నైవాషా,అంబోసెలి లాంటి ప్రదేశాలు ఈ సినిమాలో ప్రధానంగా చూపించబోతున్నారు. ఇది కేవలం సినిమా కాదు, మా దేశాన్ని ప్రపంచానికి చూపించగల శక్తివంతమైన వేదిక అని తన ట్వీట్లో పేర్కొన్నారు. SSMB 29 సినిమాను ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. 100 కోట్ల మంది ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ పాన్ వరల్డ్ స్కేల్లో తెరకెక్కుతోంది. SSMB 29 సినిమాతో కెన్యా తన చరిత్రను ప్రపంచంతో పంచుకోవడం పట్ల మా దేశం చాలా గర్వపడుతోంది అని రాసుకొచ్చారు ముదావాది. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఇండియన్ అడ్వెంచర్ ఫిల్మ్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. నవంబర్ 2025లో సినిమా నుంచి ఫస్ట్ అప్డేట్ రానుంది.