హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్ల వద్ద ఎన్టీఆర్ అభిమానులు సందడి చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ బ్లాక్‌బస్టర్ తర్వాత దేవరతో ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆరేండ్ల తర్వాత ఆయన నటించిన సినిమా విడుదల కావడంతో అభిమానులు ఫుల్ ఖూష్ అవుతున్నారు. దీంతో సినిమా టాకీస్ల వద్ద పండుగ వాతావారణం నెలకొంది. అయితే అభిమానులతోపాటు ప్రముఖులు కూడా సినిమాను వీక్షిస్తున్నారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తన కుటుంబ సభ్యులతో కలిసి సినిమాను వీక్షించారు. హైదరాబాద్ బాలానగర్‌లోని మైత్రి విమల్ థియేటర్‌కు వచ్చిన ఆయన అక్కడి సినీ ప్రియులకు అభివాదం చేశారు. వారితో కలిసి మూవీ చూశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి శ్రీరాములు థియేటర్లో సినిమాను చూశారు.
Ace Indian director mana #ssrajamouli with family for #Devara first day first show in Hyderabad #jrntr @tarak9999 pic.twitter.com/fQSyUehN5U
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) September 27, 2024