మా ప్రయాణంలో మరో ఘనత
“ఆర్ఆర్ఆర్' సమయంలో సినిమాను డాల్బీ విజన్‌లో గ్రేడ్ చేయాలనుకున్నప్పుడు జర్మనీ వరకు వెళ్లాల్సివచ్చింది. మనదేశంలో ఆ సదుపాయం లేకపోవడం నిరుత్సాహపరచింది. కానీ ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో డాల్బీ విజన్ గ్రేడింగ్ సౌకర్యాన్ని చూసి థ్రిల్ అయ్యాను’ అన్నారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి.
“ఆర్ఆర్ఆర్’ సమయంలో సినిమాను డాల్బీ విజన్‌లో గ్రేడ్ చేయాలనుకున్నప్పుడు జర్మనీ వరకు వెళ్లాల్సివచ్చింది. మనదేశంలో ఆ సదుపాయం లేకపోవడం నిరుత్సాహపరచింది. కానీ ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో డాల్బీ విజన్ గ్రేడింగ్ సౌకర్యాన్ని చూసి థ్రిల్ అయ్యాను’ అన్నారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి. ఇటీవల హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోలో భారతదేశంలోనే మొట్టమొదటి డాల్బీ సర్టిఫైడ్ పోస్ట్‌ప్రొడక్షన్స్ ఫెసిలిటీ యూనిట్‌ను రాజమౌళి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..డాల్బీ విజన్‌లో సినిమాను చూడటం సరికొత్త అనుభవమని, ప్రతి ఫ్రేమ్‌లో స్పష్టతతో కథను మరో స్థాయికి తీసకెళ్తుందని అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ వైస్ ఛైర్మన్, అగ్ర హీరో నాగార్జున మాట్లాడుతూ ‘అన్నపూర్ణ స్టూడియోస్ 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఈ సందర్భంలో ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. వర్చువల్ ప్రొడక్షన్లో అగ్రగామిగా ఉండాలనే లక్ష్యంతో ఇన్నోవేటివ్ ఆలోచనలతో ఈ ఫెసిలిటీని ఏర్పాటు చేశాం. ఇది మా ప్రయాణంలో మరో ఘనత’ అన్నారు. ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ సుప్రియా యార్లగడ్డ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

