Unstoppable-2 | నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ సీజన్-2’ డబుల్ సందడితో దూసుకుపోతుంది. ఈ మధ్య కాలంలో ఈ టాక్ షోకు వచ్చినంత క్రేజ్ దేనికి రాలేదనండంలో అతిషయోక్తి లేదు. సీజన్-1కు అనూహ్య రెస్పాన్స్ రావడంతో ఆహా సంస్థ సీజన్-2ను ఇటీవలే స్టార్ట్ చేసింది. మొదటి ఎపిసోడ్ నుండి ఈ టాక్ షో మంచి వ్యూవర్షిప్ను సాధిస్తూ వచ్చింది. సినీ ప్రముఖుల నుండి పొలిటీషియన్స్ వరకు అందరితో బాలయ్య చేసిన అల్లరి ప్రేక్షకులను కనువిందు చేస్తుంది.
ఇక ఇటీవలే ఈ షోకు ప్రభాస్ గెస్ట్‌గా వచ్చిన విషయం తెలిసిందే. రెండు పార్టులుగా రిలీజైన ప్రభాస్ ఎపిసోడ్ మంచి వ్యూవర్షిప్ దక్కించుకుంది. తాజాగా ఈ ఎపిసోడ్‌కు ‘వీరసింహా రెడ్డి’ టీమ్ వచ్చినట్లు తెలుస్తుంది. గోపిచంద్ మలినేని, శృతిహాసన్‌లతో ఎపిసోడ్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడీయోస్‌లో జరుగుందని టాక్. ఈ ఎపిసోడ్ వీరసింహా రెడ్డి రిలీజ్‌కు ముందే స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ కానుంది. ఇటీవలే పవన్‌తో షూటింగ్ జరిగిన విషయం తెలిసిందే.