The Academy | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఖాతాలో మరో అరుదైన గౌరవం చేరింది. 17 ఏళ్ల క్రితం విడుదలైన ఆయన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఓం శాంతి ఓం’ లోని ఐకానిక్ డైలాగ్ వీడియోను ఆస్కార్ అకాడమీ (The Academy) తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా.. దీనిపై షారుఖ్ ఖాన్ తనదైన శైలిలో స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. అకాడమీ షేర్ చేసిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో రీ-షేర్ చేస్తూ.. “ఓం చెప్పిన స్పీచ్‌తో నన్ను పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు అకాడమీ. ఇప్పుడు నేను నిజంగానే ఈ లోకానికి రాజునని (King of the world) భావిస్తున్నాను. హా హా.. అంటూ సరదాగా రాసుకొచ్చారు. ఈ అరుదైన గౌరవంపై సినిమా దర్శకురాలు ఫరా ఖాన్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. నాకు ఈ పోస్ట్‌ను పంపిన ప్రతి ఒక్కరికీ, అలాగే అకాడమీకి ధన్యవాదాలు. ‘పిక్చర్ అబీ బాకీ హై మేరే దోస్త్’ (సినిమా ఇంకా మిగిలే ఉంది మిత్రమా) అంటూ సినిమాలోని ఫేమస్ డైలాగ్‌ను ఆమె గుర్తు చేశారు.
షారుఖ్ ఖాన్ హీరోగా ఫరా ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 2007లో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాతోనే దీపికా పదుకొణె బాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వగా.. ఈ సినిమాకు దీపికా రూపాయి పారితోషికం తీసుకోవడం విశేషం.
మరోవైపు షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తన రాబోయే భారీ చిత్రం ‘కింగ్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 24, 2026న క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. ఇందులో షారుఖ్‌తో పాటు అభిషేక్ బచ్చన్, దీపికా పదుకొణె మరియు ఆయన కుమార్తె సుహానా ఖాన్ కూడా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ షారుఖ్‌ను సరికొత్త మాస్ లుక్‌లో చూపిస్తూ అంచనాలను పెంచేశాయి.
Thank u @TheAcademy for sending me down memory lane with Om’s speech… now I truly feel like the King of the world. Ha ha https://t.co/14QeUlPij9
— Shah Rukh Khan (@iamsrk) April 17, 2026