OG | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న సినిమాల్లో ఒకటి ఓజీ (OG). సాహో ఫేం సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఓజీలో గ్యాంగ్‌లీడర్ ఫేం ప్రియాంకా అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. చెన్నై భామ శ్రియా రెడ్డి (Sriya Reddy) కీలక పాత్రలో నటిస్తున్నట్టు ఇటీవలే ఓ అప్డేట్ కూడా అందించారు మేకర్స్. అయితే ఓజీలో ఎలా భాగమయ్యిందో చెప్పుకొచ్చింది శ్రియారెడ్డి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది శ్రియా రెడ్డి. సినిమా స్క్రిప్ట్ నన్ను కొంచెం థ్రిల్ చేసింది. పవన్ కల్యాణ్ లీడ్ రోల్లో నటిస్తుండటంతో చాలా స్పెషల్‌గా మారింది. సలార్ సినిమా పూర్తయ్యే వరకు ఏ సినిమా చేయకూడదనుకున్నా. పవన్ కల్యాణ్ సార్ నటిస్తున్న ఓజీలో అద్బుతమైన పాత్ర ఉందని సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ నాకు చెప్పారు. అయితే కమర్షియల్ సినిమాలో వచ్చే రెగ్యులర్ క్యారెక్టర్ అని మొదట ఆసక్తి చూపలేదు.
ఆ తర్వాత డైరెక్టర్ సుజిత్ ఫోన్ చేసి కథ చెప్పారు. ఫోన్ కాల్ సౌకర్యవంతంగా ఉండకపోవడంతో డైరెక్టుగా నన్ను కలవాలనుకుంటున్నట్టు సుజిత్ చెప్పారు. సినిమా థీమ్ నచ్చితే నేనే సుజిత్‌ను కలుస్తానని చెప్పా. మీరు నమ్మరు. కేవలం ఐదు నిమిషాల నరేషన్ (కథనం)లోనే ఓజీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశానని చెప్పుకొచ్చింది. శ్రియారెడ్డి మొత్తానికి అలా ఓజీలోకి వచ్చేసిందన్నమాట. మరి సుజిత్ శ్రియారెడ్డి పాత్రను ఎలా డిజైన్ చేశాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఓజీ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. తెలుగులో అప్పుడప్పుడు, అమ్మ చెప్పింది సినిమాల్లో నటించింది శ్రియా రెడ్డి. విశాల్‌తో కలిసి పొగరు చిత్రంలో నటించింది. శ్రియారెడ్డి మరోవైపు ప్రశాంత్ నీల్- ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ సలార్‌లో కూడా కీలక పాత్ర పోషిస్తోంది.