టికెట్ టూ ఫినాలే టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ ఫిజికల్ టాస్క్ ఇచ్చారు. బోర్డ్‌పై స్విచ్ఛ్‌లు బల్బ్‌లు ఇచ్చి బజర్ మోగేసరికి ఐదైదు చొప్పున బల్బ్స్ వెలిగించాలని.. తక్కువ టైంలో ఎక్కువ బల్బ్‌లు వెలిగించిన వాళ్లే ఈ టాస్క్‌లో విజేతలుగా నిలుస్తారని చెప్పారు. అయితే శ్రీరామ్, సిరిలు కాళ్లకి కట్లు కట్టుకుని ఉండటంతో వారి ప్లేస్‌లో మరో ఇద్దరు టాస్క్ ఆడొచ్చని బిగ్ బాస్ చెప్పారు.
ఇప్పటికీ సరిగా నడవలేకపోతున్న సిరి, శ్రీరామ్ ఇద్దరి తరపున షణ్ను ఆడాడు. ఈ ఛాలెంజ్‌లో శ్రీరామ్, సన్నీ, సిరి, మానస్ వరుసగా నాలుగు స్థానాల్లో నిలిచారు. మొత్తంగా ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి మానస్ 29 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. 28 పాయింట్లతో శ్రీరామ్ రెండో స్థానం.. 24 పాయింట్లతో సిరి మూడో స్థానం.. 23 పాయింట్లతో సన్నీ నాలుగో స్థానంలో నిలిచారు. దీంతో సన్నీ, సిరి టికెట్ టు ఫినాలే పోటీ నుంచి తప్పుకున్నారు.
చివరి ఛాలెంజ్ మానస్-శ్రీరామ్‌ల మధ్య జరిగింది. శ్రీరామ్ విజయం సాధించి ఫినాలేలో అడుగుపెట్టాడు. షణ్ను, సన్నీ ఇద్దరూ తన గెలుపుకు సాయం చేశారని వారికి అభినందనలు తెలిపాడు. ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యానోచ్ అంటూ తెగ సంబరపడిపోయిన శ్రీరామ్‌కు పట్టరాని ఆనందంతో రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు. మరోపక్క చివరిదాకా వచ్చి ఓటమిని చవిచూసినందుకు మానస్ దిగులుచెందాడు.
సిరికి మోషన్స్ అవుతున్నాయంటే ప్రియాంక ఏదో సలహా ఇవ్వడానికి ప్రయత్నించింది. షుగర్ వాటర్ తాగమని, అరటిపండు తినమని తనకు తోచిన సూచనలు ఇచ్చింది. ఇప్పటికే ఆమె చేసిన వైద్యం వల్ల శ్రీరామ్ పూర్తిగా బెడ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పుడు కొత్తగా సిరికి వైద్యసలహా ఇవ్వడంతో వెంటనే స్పందించిన బిగ్‌బాస్ సొంత వైద్యం చేయడం శ్రేయస్కరం కాదని హెచ్చరించాడు. ఈ దెబ్బతో పింకీ ముఖం చిన్నబోయింది.