Srinu Vaitla | టాలీవుడ్ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం విశ్వం. గోపిచంద్ కథానాయకుడిగా వస్తున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడటంతో వరుస ప్రమోషన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీజర్‌ను విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా ట్రైలర్‌ను వదిలింది.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. శ్రీనువైట్ల మళ్లీ తన కామెడీతో అలరించబోతున్నట్లు తెలుస్తుంది. కవ్యా థాపర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్, సంగీతం: చేతన్ భరద్వాజ్, నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి, దర్శకత్వం: శ్రీను వైట్ల.