Srikakulam Sherlock Homles | టాలీవుడ్ నటులు వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల, రవితేజ మహాద్యాసం ప్రధాన పాత్రల్లో రైటర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్ పై లాస్య రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు ‘మా ఊరు శ్రీకాకుళం’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయగా.. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ప్రేమించానే పిల్లా అంటూ సాగే సెకండ్ సింగిల్‌ను విడుదల చేశారు. సునీల్ కశ్యప్ ఈ సాంగ్‌ను కంపోజ్ చేయగా.. పూర్ణాచారి లిరిక్స్ అందించారు రాహుల్ సిప్లిగంజ్ పాడారు.
శ్రీకాకుళం ప్రాంతం గొప్పదనాన్ని తెలియజేసేలా ఈ సినిమా ఉంటుందని వెన్నెల కిషోర్ కెరీర్లో ఇదొక డిఫరెంట్ మూవీ అవుతుందని, వినోదం మేళవించిన గూఢచారి కథాంశమని చిత్ర బృందం పేర్కొంది. సీయా గౌతమ్, స్నేహ గుప్తా, రవితేజ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మల్లికార్జున్ ఎన్, సంగీతం: సునీల్ కశ్యప్, రచన-దర్శకత్వం: రైటర్ మోహన్.