Srikakulam Sherlock Homles OTT | టాలీవుడ్ నటులు వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల, రవితేజ మహాద్యాసం ప్రధాన పాత్రల్లో రైటర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్ పై లాస్య రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు.
క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి వినోదాన్ని పంచింది. ఇప్పుడు తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఈటీవీ విన్లో ఈ చిత్రం జనవరి 24 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను పంచుకుంది.
Telugu film #SrikakulamSherlockHolmes will premiere on ETV Win on January 24th. pic.twitter.com/vZVGB9nx9G
— Streaming Updates (@OTTSandeep) January 22, 2025