శ్రీస్కంద హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘మన డాక్టర్ బాబే’. చలపతి కుమార్ పువ్వల దర్శకుడు. స్కంద మూవీస్ పతాకంపై కృతాక్షి నిర్మిస్తున్నారు. శనివారం దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్.ఆదిత్య టీజర్‌ను లాంచ్ చేశారు. జంధ్యాల, ఈవీవీ తరహాలో ఆద్యంతం నవ్వించే చిత్రమిదని, ఓ సెన్సిటివ్ పాయింట్‌ను జాగ్రత్తగా డీల్ చేస్తూ ఈ సినిమా తీశారని హీరో శ్రీస్కంద తెలిపారు.
వినోదంతో పాటు హృదయాన్ని కదిలించే భావోద్వేగాలుంటాయని, ప్రేక్షకులు కన్నీటి చెమ్మతో థియేటర్ల నుంచి బయటకు వస్తారని దర్శకుడు చలపతి కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.