వాటి గురించి ఇప్పుడే చెప్పలేను
సాధారణంగా ఎక్కువమంది హీరోయిన్లు ‘మేం తింటాం కానీ వంట చేయలేం’ అంటుంటారు. కానీ శ్రీలీల మాత్రం ఎలాంటి వంటనైనా ఈజీగా చేసేస్తానంటున్నది.
సాధారణంగా ఎక్కువమంది హీరోయిన్లు ‘మేం తింటాం కానీ వంట చేయలేం’ అంటుంటారు. కానీ శ్రీలీల మాత్రం ఎలాంటి వంటనైనా ఈజీగా చేసేస్తానంటున్నది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తనలోని పాకశాస్త్ర నైపుణ్యం గురించి శ్రీలీల మాట్లాడింది. ‘నాకు సాంబారు, కొబ్బరన్నం, కుర్మాకూర.. ఇలా చాలా వంటలు వచ్చు. అయితే.. ఎలాంటి వెరైటీ వండినా.. పెరుగన్నం మాత్రం నా మెనూలో పక్కగా ఉండాల్సిందే.
చిన్నప్పట్నుంచీ పెరుగన్నమంటే చాలా ఇష్టం’ అని శ్రీలీల పేర్కొన్నారు. సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదేంటి? అనడిగితే.. ‘గత కొన్ని రోజులుగా షూటింగులతో బిజీగా ఉన్నాను. నేను చేస్తున్న సినిమాలకు చెందిన వివరాల గురించి యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించలేదు. అందుకే ఆ సినిమాల గురించి నేను ఇప్పుడే చెప్పలేను. ప్రస్తుతానికైతే రెండ్రోజులు బ్రేక్ దొరికింది. ఈ విలువైన సమయాన్ని ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చారు శ్రీలీల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

