Pushpa The Rule | టాలీవుడ్ స్టార్ దర్శకుడు సుకుమార్ సినిమాలలో స్పెషల్ సాంగ్‌లు ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మొదటి సినిమా ఆర్యలో మొదలైన ఈ సెంటిమెంట్ నాన్నకు ప్రేమతో సినిమాలో తప్ప ప్రతి సినిమాలో కొనసాగుతుంది. అ అంటే అమలాపురం, 36-24-36, రింగ రింగా, డియాలో డియాలా, జిగేల్ రాణి, లండన్ బాబు, ఊ అంటావా మావ.. సాంగ్‌లతో ప్రేక్షకులకు అలరించాడు. అయితే ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం పుష్ప ది రూల్(Pushpa The Rule). ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వస్తుంది. రష్మిక మందాన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ తప్ప మిగతా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ స్పెషల్ సాంగ్‌ను ఎవరు చేస్తున్నారా అనే దానిపై కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఒకవైపు సమంతనే మళ్లీ చేస్తుంది అనగా.. ఇంకోవైపు బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ ఐటం సాంగ్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే శ్రద్ధ కపూర్ ఈ పాట కోసం ఎక్కువ మొత్తంలో పారితోషికం అడుగుతుండడంతో టాలీవుడ్ నటి శ్రీలీలతో ఈ సాంగ్ కంప్లీట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పండగా అని చెప్పుకోవాలి. ఎందుకంటే శ్రీలీల కూడా డ్యాన్సర్ అవ్వడంతో థియేటర్లు దద్దరిల్లిపోతాయని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.