Sreeleela | తెలుగు తారాపథంలోకి ఒక్కసారిగా దూసుకొచ్చింది అందాల భామ శ్రీలీల. అనతికాలంలోనే మంచి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. ఓవైపు వైద్య విద్యను అభ్యసిస్తూనే మరోవైపు సినీ రంగంలో రాణిస్తున్నది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ‘గుంటూరు కారం’ చిత్రంలో మహేష్‌బాబుతో జోడీ కట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. సంకా్రంతికి ప్రేక్షకుల ముందుకురానుంది.
శుక్రవారం నుంచి మహేష్‌బాబు-శ్రీలీలపై ఓ డ్యూయెట్ సాంగ్‌ను తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ పాట షూటింగ్ కోసం శ్రీలీల ఎంబీబీఎస్ సెమిస్టర్ ఎగ్జామ్స్‌ను వదులుకుందట. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో తన వల్ల షూటింగ్‌కు ఇబ్బందులు ఎదురు కావొద్దనే ఉద్దేశ్యంతో శ్రీలీల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తొలుత షూటింగ్‌కు విరామమిచ్చి పరీక్షలకు హాజరు కావాలని భావించినా.. ఆ తర్వాత సినిమా కోసం తన మనసు మార్చుకున్నట్లు తెలిసింది. ఈ పాటతో ‘గుంటూరు కారం’ షూటింగ్ పూర్తికానుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.