శ్రీవిష్ణు కథానాయకుడిగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నది. ‘ప్రొడక్షన్ నెం 39’గా రూపొందుతున్న ఈ చిత్రానికి సన్నీ సంజయ్ దర్శకుడు. నేటి యువత జీవితంలో ఎదురయ్యే అనుభవాలు, భావోద్వేగాలు, కలలు, ఆశలు, ఆకాంక్షలు, సవాళ్లను ప్రతిబింబించే కథతో ఈ చిత్రం రూపొందుతున్నదని, అన్ని రకాల భావోద్వేగాలతో సరికొత్త ప్రయాణాన్ని ఆవిష్కరించే ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుందని, ప్రతి ఒక్కరూ తమకు తాము చూసుకునేలా ‘ఇది మన అందరి కథ’ అనే భావన కలిగించేలా ఈ కథ ఉంటుందని మేకర్స్ తెలిపారు.
ఈ సినిమా ప్రపంచాన్ని పరిచయం చేస్తూ మేకర్స్ సోమవారం గ్లింప్స్‌ని విడుదల చేశారు. యువతకు దగ్గరగా ఉండే అంశాలతో ఈ సినిమా రూపొందుతున్నట్టు గ్లింప్స్ చెబుతున్నది. సూర్యదేవర నాగవంశీ సమర్పిస్తున్న ఈ చిత్రానికి హారికా సూర్యదేవర నిర్మాత.