SreeVishnu | టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇటీవల విడుదలైన చిన్న చిత్రం ‘దీవాన’ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా సక్సెస్ సాధించిన నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ‘థ్యాంక్యూ మీట్’ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు ప్రేక్షకులకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించి సర్ప్రైజ్ చేశారు. ‘దీవాన’ సినిమా తనకు విపరీతంగా నచ్చేసిందని పేర్కొన్న శ్రీవిష్ణు.. ఈ చిత్రాన్ని మరింత మంది ప్రేక్షకులకు చేరువ చేసేందుకు ఒక క్రేజీ అనౌన్స్మెంట్ చేశారు. రేపు (శనివారం) ఈ సినిమా ప్రదర్శితమవుతున్న ప్రతి థియేటర్లోనూ, మొదటి 25 టికెట్లకు గానూ ఒకటి కొంటే మరొకటి ఉచితం (Buy 1 Get 1) ఆఫర్‌ను వర్తింపజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వినూత్న ఆఫర్ వల్ల సినిమాకు మౌత్ పబ్లిసిటీ మరింత పెరిగి, థియేటర్లలో లాంగ్ రన్ లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా శ్రీవిష్ణు సినిమాపై తనకున్న ఫీలింగ్స్‌ను పంచుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నాతో ‘సింగిల్’ చిత్రాన్ని నిర్మించిన లేడీ ప్రొడ్యూసర్ విద్య కొప్పినీడి కోరడంతో నిన్న ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చూశాను. అయితే ఇంటర్వెల్లో వచ్చిన ట్విస్ట్‌కి నాకు ఒక్కసారిగా చిప్ ఎగిరిపోయింది. దాంతో మిగతా పనులన్నీ పక్కన పెట్టేసి మరీ సెకండ్ హాఫ్ కూడా పూర్తిగా చూశాను” అని శ్రీవిష్ణు నవ్వుతూ వెల్లడించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడి ప్రతిభను, నటీనటుల నటనను శ్రీవిష్ణు మనస్ఫూర్తిగా అభినందించారు. దర్శకుడికి ఎంత టాలెంట్ ఉందో, దానికి తగ్గట్టుగానే అద్భుతమైన టెక్నీషియన్స్, ఆర్టిస్ట్‌లు దొరకడం వల్లే సినిమా ఇంత బాగా వచ్చిందని కొనియాడారు.
సినిమా చూస్తున్నంత సేపు తాను అందులో లీనమైపోయానని చెబుతూ.. ఒకానొక సందర్భంలో స్క్రీన్‌పై ఉన్న పాత్రల మీద నాకు విపరీతమైన కోపం వచ్చింది. ప్రతి సినిమాకూ మనకు ఇలాంటి ఫీలింగ్ రాదు. మనం కథను అంతలా ఓన్ చేసుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. అలాంటి అద్భుతమైన అనుభూతిని ‘దీవాన’ సినిమా నాకు పూర్తిగా అందించింది అని శ్రీవిష్ణు ప్రశంసల జల్లు కురిపించారు.
#SreeVishnu Said – NEVER SEEN THIS LEVEL OF INTERVAL IN TELUGU CINEMA – After Watching #Deewana Film 💥💥💥💥pic.twitter.com/ApuImsnv2t
— GetsCinema (@GetsCinema) June 26, 2026