‘ఎన్ని ఉన్నత చదువులు చదివినా, ఎంత గొప్ప స్థాయికి చేరుకున్నా..ప్రతి ఒక్కరి జీవితంలో పదో తరగతికి ప్రత్యేక స్థానం ఉంటుంది. నాటి మధుర జ్ఞాపకాలు జీవితాంతం హృదయంలో నిలిచిపోతాయి. అలాంటి అందమైన రోజుల్ని గుర్తుకుతెస్తూ వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన చిత్రం ‘టెన్త్‌క్లాస్ డైరీస్’. అవికాగోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అంజి దర్శకుడు. అచ్యుత రామారావు, పి.రవితేజ మన్యం నిర్మిస్తున్నారు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. నిర్మాత మాట్లాడుతూ ‘ప్రతి ఒక్కరిని పదో తరగతి రోజుల్లోకి తీసుకెళ్లే చిత్రమిది. టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభిస్తున్నది. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంటుంది’ అన్నారు. శ్రీనివాసరెడ్డి, వెన్నెల రామారావు, అర్చన, హిమజ, శివబాలాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: ‘గరుడవేగ’ అంజి.