Spy Movie On Ott | కారణాలు తెలియదు కానీ చాలా హడావిడిగా స్పై సినిమాను రిలీజ్ చేశారు. కేవలం వారం ముందు రిలీజ్ డేట్‌ను కన్ఫర్మ్ చేసి సగం జనాలకు సినిమా వచ్చిన సంగతే తెలియకుండా విడుదలైంది. నిఖిల్ సినిమాలకు ముందు నుంచి మంచి క్రేజ్ ఉంది. దానికి తోడు టీజర్, ట్రైలర్లు గట్రా సినిమాపై తీవ్ర ఆసక్తిని నెలకొల్పాయి. నాలుగు వారాల కిందట రిలీజైన ఈ సినిమా మిక్స్డ్ రివ్యూలు తెచ్చుకుంది. సాలిడ్ కంటెంట్‌తో వచ్చినా.. దాన్ని తెరపై సరిగ్గా చూపించడంలో దర్శకుడు గ్యారీ పట్టు తప్పాడు. స్టంట్స్ మాత్రం హాలీవుడ్ లెవల్లో ఉన్నాయని పలువురు సినీ లవర్స్ వెల్లడించారు. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా గత అర్ధ రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా 1945లో ప్లయిన్ క్రాష్ లో అంతర్ధానమైన సుభాష్ చంద్ర బోస్ మరణం మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. ఈడి ఎంటర్టైనమెంట్స్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి, చరణ్ తేజ్ ఉప్పలపాటిలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. నిఖిల్‌కు జోడీగా సాన్య థాకూర్, ఐశ్వర్య మీనన్‌లు నటించారు. ఐశ్వర్య రాజేష్ కీలకపాత్రలో నటించిన ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.