ప్రభాస్ కథానాయకుడిగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ ఎప్పుడు సెట్స్‌మీదకు వెళ్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రకటన నాటి నుంచే భారీ అంచనాలేర్పడ్డాయి. ప్రభాస్ కటౌట్‌కి సందీప్ రెడ్డి వంగా శైలి అగ్రెసివ్ ప్రజెంటేషన్ తోడైతే ఇక బాక్సాఫీస్ రికార్డులు బద్దలే అంటున్నారు. ఈ సినిమా షూటింగ్‌పై తాజా అప్డేట్ను అందించారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. ప్రస్తుతం తాను ఈ సినిమాకు సంబంధించిన లొకేషన్స్ అన్వేషణలో ఉన్నానని, మెక్సికోలో షూటింగ్‌ను మొదలుపెట్టే ఆలోచన ఉందని తెలిపారు. ఈ ప్రకటనతో వేసవిలోగా ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. ‘స్పిరిట్’ చిత్రంలో ప్రభాస్ నిజాయితీ కలిగిన పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. కెరీర్లో తొలిసారి ఆయన కాప్ రోల్లో నటిస్తుండటం విశేషం. భారీ వ్యయంతో టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్ నిర్మించనున్నారు.