Special OPS 2 | ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ + హాట్‌స్టార్ (ఇప్పుడు జియో హాట్‌స్టార్)లో వచ్చిన స్పెషల్ ఓపీఎస్ (Special OPS) వెబ్ సిరీస్ గుర్తుందా. ఇప్పటికే రెండు పార్టులుగా వచ్చిన ఈ వెబ్‌సిరీస్ ఓటీటీలో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోయింది. ఇక ఈ వెబ్‌సీరిస్‌లో నటించిన బాలీవుడ్ సీనియర్ నటుడు కేకే మీనన్ (Kay Kay Menon) ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. హిమ్మత్ సింగ్ అనే రా ఏజెంట్ తన దేశంపై జరుగబోతున్న ఉగ్రదాడులను ముందే తెలుసుకోని వాటిని ఆపడానికి ఒక స్పెషల్ టీమ్‌ని ఏర్పాటు చేస్తాడు. ఇక ఈ టీమ్ చేసే విన్యాసాలు ఏంటి అనేది వెబ్ సిరీస్ స్టోరీ.
అయితే ఇప్పటికే ఫస్ట్ సీజన్లో రెండు భాగాలుగా వచ్చి అలరించిన ఈ వెబ్ సిరీస్ తాజాగా సెకండ్ సీజన్‌తో అలరించబోతుంది. తాజాగా రెండో సీజన్‌కి సంబంధించి మేకర్స్ అనౌన్స్‌మెంట్‌ని పంచుకోగా.. ఇందులో ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సీజన్లో కేకే మీనన్‌కి తోడుగా వినయ్ పాఠక్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే ప్రకాష్ రాజ్, తాహిర్ రాజ్ భాసిన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్ ఈ సీజన్‌పై అంచనాలను మరింత పెంచేసింది. హిమ్మత్ సింగ్ తన ప్రత్యేక బృందంతో కలిసి దేశానికి ముప్పు కలిగించే శత్రువులతో తీవ్రంగా పోరాడుతున్నట్లు టీజర్లో చూపించారు. భారీ పేలుళ్లు, ఉత్కంఠభరితమైన పోరాట సన్నివేశాలతో ఈ సీజన్ ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. ఈసారి కథాంశం అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ఛేదించే నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.
‘స్పెషల్ ఓపీఎస్’ మొదటి సీజన్ 2020లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ‘స్పెషల్ ఓపీఎస్ 1.5: ది హిమ్మత్ స్టోరీ’ కూడా ప్రేక్షకులను అలరించింది. ఈ రెండు సీజన్ల విజయం ఇప్పుడు రాబోతున్న రెండో సీజన్‌పై భారీ ఆసక్తిని నెలకొల్పింది. విడుదల తేదీ ఇంకా ప్రకటించనప్పటికీ, త్వరలోనే ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కథ మన ముందుకు రానుందని సమాచారం.
It was wonderful to be a part of this team #SpecialOps2, coming soon, only on #JioHotstar@neerajpofficial @KayKayMenon4U @shivamNair @fridaystorytellers#SpecialOps2OnJioHotstar pic.twitter.com/dJgYep05Jn
— Prakash Raj (@prakashraaj) May 15, 2025