Hyper aadi| బుల్లితెర షోస్‌తో పాపులర్ అయిన వారిలో హైపర్ ఆది ఒకరు. ఆయన చేసే కామెడీ, వేసే పంచ్‌లు ప్రతి ఒక్కరికి మంచి వినోదాన్ని పంచుతూ ఉంటాయి. ఇప్పుడు సినిమాలలో కూడా ఆది వినోదం పంచుతున్నాడు. హైపర్ ఆది ‘జబర్దస్త్’ కామెడీ షోతో బాగా పాపులర్ అయ్యాడు. తన రైటింగ్ స్కిల్క్ తో, క్రియేటివిటీతో అతి తక్కువ సమయంలోనే బుల్లితెర స్టార్ గా ఎదిగిన ఆది ప్రస్తుతం ‘ఢీ’, ‘శ్రీ దేవీ డ్రామా కంపెనీ’ టీవీ షోల్లో సందడి చేస్తున్నారు. 2015 నుంచి 2022 వరకు జబర్దస్త్ వేదికపై విభిన్న స్కిట్లతో అలరించిన ఆది ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో తెగ సందడి చేస్తున్నాడు.
ఆది చిన్న వారిపైనే కాదు పెద్ద పెద్ద సెలబ్రిటీలపై కూడా పంచ్‌లు వేస్తుంటాడు. మరోవైపు రాజకీయాలలో కూడా రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్నటికి మొన్న జనసేన తరపున ప్రచారాలు కూడా చేశాడు. అయితే ఇప్పటికి స్టిల్ బ్యాచిలరగా ఉన్న హైపర్ ఆదిపై పలువురు విమర్శలు చేస్తుంటారు కూడా. అమ్మాయిల విషయంలో కూడా హైపర్ ఆదిపై గతంలో అనేక రూమర్స్ చక్కర్లు కొట్టాయి. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో సౌమ్యరావు కు హైపర్ ఆదిపై ఎలాంటి ఒపీనియన్ ఉంది, అమ్మాయిలతో ఎలా ఉంటాడు అనే దానిపై స్పందించింది.
హైపర్ ఆదితో నాకు ఎలాంటి కనెక్షన్ లేదు. ఒకే దగ్గర పనిచేస్తాం. అంతకు మించి మా మధ్య ఏమీ లేదు. అయితే హైపర్ ఆది కొత్తగా షోకు వచ్చిన అమ్మాయిలతో బాగా పులిహోర కలుపుతుంటాడు. అలాగే కొత్త అమ్మాయిలపై పంచులు అతిగా వేసి నవ్వించే ప్రయత్నం చేస్తాడు. ఇదంతా స్క్రిప్ట్ ను పండించడంలో భాగం అని, అతను ఆఫ్ స్క్రీన్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడని, తనకు ఎంతో సోర్టింగ్ గా ఉన్నాడని సౌమ్యారావు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.