Ramarao On Duty | మాస్రాజ రవితేజ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ తీరిక లేకుండా షూటింగ్లలో పాల్గొంటున్నాడు. ఏడాదికి రెండు సినిమాలను విడుదల చేసే విధంగా రవితేజ ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఇటీవలే విడుదలైన ‘ఖిలాడీ’తో భారీ ఫ్లాప్‌ను అందుకున్న మాస్రాజ ఈ సారి ‘రామారావు ఆన్ డ్యూటీ’తో ఎలాగైనా మంచి హిట్టు సాధించాలని కసితో ఉన్నాడు. శరత్ మండవ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో చిత్ర బృందం తరచూ ఏదో ఒక అప్డేట్తో ప్రేక్షకులను పలకరిస్తుంది. తాజాగా చిత్ర బృందం రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.
రవితేజ కాజ్యువల్‌గా నడుస్తున్నట్లు పోస్టర్‌ను విడుదల చేశారు. అంతేకాకుండా మరో అప్డేట్ను కూడా ప్రకటించారు. ఈ చిత్రం నుంచి మరో సింగిల్‌ను విడుదల తేదీని ప్రకటించారు. ‘సొట్టల బుగ్గల్లో’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను మే 7న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇటీవలే విడుదలైన ‘బుల్ బుల్ తరంగ్’ పాటకు విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రంలో రవితేజకు జోడీగా దివ్యాంక కౌశిక్, రజీషా విజయన్లు హీరోయిన్లుగా నటించారు. చాలా కాలం తర్వాత సీనియర్ నటుడు వేణు తోట్టెంపూడి ఈ చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. శ్రీ లక్ష్మివెంకటేశ్వరా సినిమాస్, ఆర్టి టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరితో కలిసి రవితేజ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో రవితేజ డిప్యూటీ కలెక్టర్‌గా కనిపించబోతున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూన్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.